WNP: సెల్లార్లలో వ్యాపారాలు సాగించే వారిని గుర్తించి వారికి నోటీసులు ఇస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వారికి కొంత కాలం గడువులోగా దుకాణాలను తొలగించకపోతే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెల్లార్లలో ఉండి వ్యాపారాలు సాగిస్తూన్న ప్రతి భవన యజమానికి నోటీసులు ఇస్తామన్నారు.