SDPT: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బెజ్జంకిలో శనివారం బీజేపీ నేతలు మండిపడ్డారు. పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం కాంగ్రెస్ మహిళా వ్యతిరేకతకు నిదర్శనమని మండల అధ్యక్షుడు కొలిపాక రాజు విమర్శించారు. మహిళా సాధికారతకు BJP కట్టుబడి ఉందని, అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.