ఆసిఫాబాద్ జిల్లాలో రెవెన్యూ అటవీ భూముల సరిహద్దు వివాదాలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా అటవీ అధికారి బాలమణి, డీఆర్వో దాసరి వేణు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేపడుతున్నట్లు తెలిపారు.