NRML: టామ్ కామ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ జిల్లా అధికారి రాథోడ్ మోహన్ సింగ్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఒమన్, జర్మనీ, ఖతార్, గ్రీస్ దేశాల్లో వివిధ వృత్తుల్లో అవకాశాలు ఉన్నాయన్నారు. 25 నుంచి 32 ఏళ్ల లోపు వారు బయోడేటాతో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.