NZBl ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, పట్టణంలో సహాయ హస్తం అందించారు. 6వ వార్డు కౌన్సిలర్ గంగూలి ఆధ్వర్యంలో పట్టణ వాస్తవ్యురాలు కొమురమ్మకు రూ. 9,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏలియా రెడ్డి, మేర నరసయ్య, గడ్డం లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.