MNCL: బెల్లంపల్లి పట్టణం తిలక్ స్టేడియం క్రీడా మైదానం పరిసరాలను సింగరేణి గ్రూప్ ఆఫ్ మైన్ ఏజెంట్, ఇంజనీర్ పరిశీలించారు. మైదానంలో ఏర్పాటు చేసిన గ్రౌండ్ ఎంట్రెన్స్ మెయిన్ గేటు విరిగిపోయి పాడైపోయిందని గమనించారు. వెంటనే మరమ్మతులు చేపడతామని, మైదానం క్రీడాకారులకు క్రీడలకు అనుకూలంగా ఉండే విధంగా శుభ్రం చేయిస్తానని హామీ ఇచ్చారు.