NRML: బాధితులకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసా క్యాంపు కార్యాలయంలో బైంసా డివిజన్ ప్రజల నుంచి 13 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీ దారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు వివరించారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.