GDWL: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అయిజ మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సై కిరణ్ వాహనదారులను హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులు కావొద్దని సూచించారు.