NLG: పెద్దఅడిశర్లపల్లి మాజీ జడ్పీటీసీ తేరా గోవర్దన్ రెడ్డి పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం గోవర్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోవర్దన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన పిలపునిచ్చారు.