NZB: జిల్లా కేంద్రంలోని ప్రధానమైన గడియారం గంజ్ కూరగాయల మార్కెట్ నిత్యం వ్యాపారులు, విక్రయదారులతో కిక్కిరిసిపోతుంది. ఇటీవల ఆవు కళేబరం పక్కనే కూరగాయలు విక్రయించిన దృశ్యం అక్కడ దిగజారిన పారిశుద్ధ్య పనులకు అద్దం పట్టింది. చాలామంది చెత్తకుప్పల పక్కనే అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు.