HYD: మలయాళ నటి సజిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో జరిగిన సివిల్ పంచాయతీలో కొందరు తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ ఘటన సినీ వర్గాల్లో, స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.