ADB: నేరడిగొండ మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ పౌర సరకుల దుకాణాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. మండలంలో రేషన్ షాప్ ఉన్నప్పటికీ లబ్ధిదారులు అధికంగా ఉండటంతో మరో పౌర సరకుల దుకాణాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. తక్కువ ధరలో లభించే బియ్యం, ఇతర సరకులను ప్రజలు కొంగలు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి నీలిమ, సాబ్లే సంతోష్ ఉన్నారు.