SDPT: కొమురవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వాహనాల పార్కింగ్, సులభ్ కాంప్లెక్స్, అంగడి తైబజార్ నిర్వహణకు వేలం వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపారు. ఆసక్తి గలవారు వాహన పార్కింగ్ రూ. 50,000, సులభ్ కాంప్లెక్స్ & తైబజార్కు రూ. 30,000 డిపాజిట్ చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.