ASF: రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఆదివారం ఆసిఫాబాద్ జిల్లాకి రానున్నారు. రెబ్బెనలో పోలీస్ లైబ్రరీను ప్రారంభించనున్నారు. అనంతరం ఆసిఫాబాద్ లో హెల్మెట్ చౌక్ ప్రారంభించి రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. తరువాత కెరమెరిలోని జోడేఘాట్ వెళ్లి అమరవీరుడు కొమురం భీం స్మారక స్థలంలో నివాళులు అర్పించనున్నారు.