SRD: నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ రంగంలో ప్రావీణ్యం సంపాదించాలని ఖేడ్ 9వ వార్డు కౌన్సిలర్ బానాపురం రాజు అన్నారు. నేడు ఖేడ్ పట్టణంలోని కళాశాల భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన SVS టెక్నాలజీస్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.