మైక్రోసాఫ్ట్ AI బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. Bing చాట్‌బాట్, AI ఇంటిగ్రేషన్లలోని సమస్యలను కనిపెట్టిన వారికి 15వేల డాలర్లను(రూ.12 లక్షలు) అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Microsoft announces AI bug bounty programme, offers up to $15K reward
Microsoft: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని లోపాలను, సమస్యలను గుర్తించగలిగే వారికి మైక్రోసాఫ్ట్ 15వేల డాలర్లను(దాదాపు రూ.12 లక్షలు) ప్రకటించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సాఫ్ట్ వేర్ ప్రభావం ఎక్కువైంది. అందుకోసం మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ప్రోగ్రామ్‌లో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ప్లాన్ చేస్తుంది. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఏఐ( Artificial Intelligence ) వ్యవస్థలు మన జీవితాల్లో ముఖ్యమైనవిగా మారుతున్నాయి. వాటిని సైబర్ నేరగాళ్ల నుంచి సురక్షితంగా ఉంచేందుకు మైక్రోసాఫ్ట్ ఈ రివార్డ్‌లను అందిస్తోంది. దీని ద్వారా తమ కంపెనీ భద్రత పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తుందో అర్థం అవుతుంది.
అనుభవం, పొజిషన్‌తో సంబంధం లేకుండా ఎవరైనా బగ్ బౌంటీ ప్రోగ్రామ్( Bug Bounty Program )లో పాల్గొనవచ్చు. అయితే 14 సంవత్సరాలు పైబడిన వారు ఇందులో ఉండాలి. మైనర్లైతే చట్టపరమైన సంరక్షకుల నుంచి అనుమతిని కలిగి ఉండాలి. బౌంటీ అవార్డ్‌ల కోసం ఇంటిగ్రేషన్లు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో AI-పవర్డ్ Bing ఇంటిగ్రేషన్, Microsoft Start యాప్‌లో AI-పవర్డ్ Bing ఇంటిగ్రేషన్, స్కైప్ మొబైల్ యాప్‌లో AI-పవర్డ్ Bing ఇంటిగ్రేషన్ వీటిలో ఏవైన సమస్యలు ఉంటే కనిపెట్టాలని కంపెనీ కోరింది.
గత సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ తన ఉత్పత్తులు, సేవలలో భద్రతా సమస్యలను కనుగొన్నందుకు $13 మిలియన్లకు పైగా బహుమతులు చెల్లించింది. అతిపెద్ద సింగిల్ బౌంటీ $200,000. ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం ద్వారా మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు మారుతున్న ఏఐ భద్రతలో లోపాలు లేకుండా చూసుకోగలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది వినియోగదారులకు AI-ఆధారిత సేవలు సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూసుకోవడంలో సహకరించమని గ్లోబల్ సెక్యూరిటీ రీసెర్చ్ కమ్యూనిటీని కూడా ఆహ్వానిస్తోంది.