LSGతో మ్యాచ్‌లో RCB బౌలర్ హేజిల్‌వుడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే 4/24తో అద్భుత ప్రదర్శన చేసిన యువ ప్లయర్ రసిక్ దర్కి కాకుండా ఒక్క వికెట్ తీసిన హేజిల్‌వుడ్‌కి POTM ఇవ్వడమేంటని అభిమానులు పెదవి విరుస్తున్నారు. మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా కూడా.. ‘రసిక్‌కి ఎందుకు ఇవ్వలేదు. ఇది సరి కాదు’ అంటూ ట్వీట్ చేశాడు.