ధోనీ మరో 2-3 రోజుల్లో పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లే జరిగితే ఈ నెల 18 SRHతో మ్యాచ్లో ధోనీ ఆడతాడని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ KKRతో జరిగే మ్యాచ్లోనే మహీ ఆడతాడని అంతా భావించారు. కానీ పూర్తి ఫిట్నెస్ కోసం మరికొంత సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా కండరాల నొప్పితో ధోనీ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.