IPL 2025 టోర్నీకి ముందు KKR.. 2024 టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌ను వదులుకున్న సంగతి తెలిసిందే. దానిపై తాజాగా అనీల్ కుంబ్లే మాట్లాడుతూ.. వారిద్దరినీ వదులుకుని KKR తప్పు చేసిందన్నాడు. అయ్యర్‌ను తీసుకున్న పంజాబ్ అతని సారథ్యంలో దశాబ్దం తర్వాత ఫైనల్‌కు చేరిందని.. సాల్ట్‌ను అందుకున్న RCB తొలి కప్ అందుకుందని గుర్తుచేశాడు.