ELR: జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని ఎస్సై వి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. కొవ్వూరు ర్యాంప్ నుంచి చింతలపూడి మండలం నామవరానికి బుక్ చేసిన ఇసుకను, దారి మళ్లించి అక్రమంగా తెలంగాణకు తరలిస్తుండగా సాయంత్రం అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను రవాణా చేస్తున్న ఆ వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.