JGL: బుగ్గారం మండలం సిరికొండ గ్రామ పంచాయితీ ఆవరణంలోని నర్సరీలో మొక్కలను సర్పంచ్ పంచిత పరిశీలించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో గ్రామంలో సుమారు 9,500కి పైగా మొక్కలు నాటే లక్ష్యంతో నర్సరీకి వివిధ రకాల మొక్కలను తెప్పించామని తెలిపారు.