జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ IPL కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) ఒప్పందాన్ని కాదనుకున్నాడు. దీంతో రాబోయే రెండు PSL సీజన్లకు అతడిని అనర్హుడిగా ప్రకటిస్తూ PCB నిర్ణయం తీసుకుంది. PSL-2026 సీజన్ కోసం ముందుగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ముజరబానీ, చివరి నిమిషంలో లీగ్ నుంచి తప్పుకుని KKR జట్టులో చేరాడు. దీంతో అతడిపై 2 ఏళ్లు నిషేదం విధించింది.