CSKపై విజయం సాధించడంలో యువ పేసర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. బ్యాటింగ్లో తాము అనుకున్న స్కోరు కంటే కనీసం 40 పరుగులు తక్కువ చేశామని పేర్కొన్నాడు. అయినప్పటికీ, బౌలర్లు తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేశారని కొనియాడాడు. తదుపరి మ్యాచ్ల్లో కూడా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.