వరుసగా 2 విజయాలు అందుకున్నప్పటికీ పంజాబ్ జట్టుకు ఆ సంతోషం లేకుండా పోయింది. చెన్నైతో మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టు ఆటగాళ్లపై ఫైన్ పడింది. టోర్నీలో ఇది రెండో సారి కావడంతో అయ్యర్‌కు రూ.24 లక్షలు.. మిగితావాళ్లకు తలో రూ.6 లక్షలు/మ్యాచు ఫీజులో 25%(ఏది తక్కువైతే అది) విధిస్తుస్తున్నట్లు IPL గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది.