JGL: రాయికల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పత్రిక సమావేశంలో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయాయని అన్నారు. రైతులకు ఎకరానికి రూ. 20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంటల బీమా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు.