MNCL: చెన్నూర్‌లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.