VZM: భూగర్భ, ఉపరితల జలమట్టాలు పెంచేందుకు ప్రభుత్వం ఈ నెల 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల ‘జలధార’ కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. చెరువుల పునరుద్ధరణ, కాలువల శుభ్రపరచడం, చెక్‌డ్యామ్‌లు, వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలోని 8,013 చెరువులను అభివృద్ధి చేయాలన్నారు.