TG: బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఆలయాల పరిసరాల్లో రాజకీయ జెండాలు, సభలు నిషేధించాలని ఆదేశించారు. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలన్నారు. రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ది పనులు చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్లో సీఎం పలు మార్పులు చేశారు.