MHBD: మరిపెడ పట్టణం శివారులోని మాకుల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15న జరిగే పారువేట ఉత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ ఛైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాల అలంకరణ పనులను ఆమె పరిశీలించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూడాలని తెలిపారు.