HNK: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడిని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దారుణ దాడులకు స్థానం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రేరణతోనే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి జరగడం దురదృష్టకరమని అన్నారు.