ADB: సిరికొండ మండలంలోని సోంపల్లి, పొన్న, రాంపూర్ గ్రామాల పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు శనివారం బుద్ధ పూర్ణిమ ప్రభుత్వ సెలవు ప్రకటించాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. వేడుకలను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గురుమూర్తి, పెంటన్న, డాక్టర్ శీను, సర్పంచ్ లక్ష్మీకాంత్, అనిల్ ఉన్నారు.