SGD: మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యా పీఠం ఆవరణలో ఉన్న పోచమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో పూజా కార్య క్రమాలు జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.