టీ20 ప్రపంచకప్ గెలిచినా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీకి గ్యారెంటీ లేకుండా పోయింది. ఫామ్ లేమితో సతమతమవుతున్న సూర్యపై సెలెక్టర్లు అసహనంతో ఉన్నారు. దీంతో 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యా లేదా అక్షర్ పటేల్‌కు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తోంది. సూర్య స్థానాన్ని భర్తీ చేసే కొత్త సారథి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.