IPL 2026 ప్రారంభానికి ముందే ముంబై యువ ఆల్‌రౌండర్ అథర్వ అంకోలేకర్ గాయంతో టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో పంజాబ్ దేశవాళీ ఆటగాడు క్రిష్ భగత్‌ను తీసుకుంటున్నట్లు తాజాగా ముంబై ప్రకటించింది. రూ.30 లక్షలకు ముంబైలో చేరిన ఈ 21 ఏళ్ల బౌలర్.. పంజాబ్ తరఫున 7 ఫస్ట్ క్లాస్, 9 లిస్ట్-A మ్యాచ్‌లాడాడు. అయితే T20ల్లో ఇంకా అరంగేట్రం చేయాల్సి ఉంది.