IPL-2026లో KKR జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. 19 ఏళ్ల KKR ఫ్రాంఛైజీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. PBKSతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో KKR ఒక పాయింట్‌ను సాధించింది. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక పాయింట్‌తో పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.