IPL 2026 ప్రారంభంపై అనుమానాలు నెలకొన్న వేళ BCCI శుభవార్త చెప్పింది. రేపు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు BCCI సెక్రటరీ దేవ్జిత్ సైకియా ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల ప్రస్తుతానికి తొలి 20 రోజుల షెడ్యూల్ మాత్రమే ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మిగతా షెడ్యూల్ తర్వాత వస్తుందని పేర్కొన్నారు. అయితే విమాన సర్వీసులకు అంతరాయం నేపథ్యంలో విదేశీ ఆటగాళ్ల రాక ప్రశ్నార్థకంగా మారింది.