IPLలో 100 వికెట్లు పడగొట్టడంతో పాటు 1000 రన్స్ చేసిన ఐదో ఆటగాడిగా RCB ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా నిలిచాడు. రాత్రి LSG ప్లేయర్ అబ్దుల్ సమద్‌ను ఔట్ చేయడం ద్వారా పాండ్యా(100 వికెట్లు – 1757 రన్స్) ఈ ఘనత సాధించగా.. అతనికంటే ముందు సునీల్ నరైన్(195W – 1816R), డ్వేన్ బ్రావో(183W – 1560R), రవీంద్ర జడేజా(173W – 3336R), ఆండ్రీ రసెల్(123W – 2651R) ఈ ఫీట్ నమోదు చేశారు.