పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌటైన సందర్భంలో.. అఘా కోపంతో హెల్మెట్, బ్యాట్‌ను విసిరికొట్టాడు. దీంతో అతడు లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. అయితే, రనౌట్ విషయంలో బంగ్లా ప్లేయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.