ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో? సీఎం ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక
సీఎం జగన్ (YS Jagan) పాలనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా అన్నమయ్య డ్యామ్ (Annamayya Dam) విషయమై ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. ఆ దుర్ఘటన జరిగి 18 నెలలైనా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు. జగన్ ఏం చేశారో ఆ దేవుడికి ఎరుక అంటూ ఎద్దేవా చేశారు. ట్విటర్ వేదికగా ఏపీ పాలన తీరుపై విమర్శలు చేశారు.
‘19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు (Heavy Rain) ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు‘ అని గుర్తు చేశారు.
‘ప్రమాద ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ అసెంబ్లీలో (Assembly) చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాం. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో? సీఎం ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక’ అని తెలిపారు.
‘అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి ఈ రోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈ రోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ.660 కోట్లకు అప్పచెప్పారు’ అని ట్వీట్ చేశారు.
‘కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారు’ అని పవన్ కల్యాణ్ ట్విటర్ లో గుర్తు చేశారు. అన్నమయ్య డ్యామ్ దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. ఈ విషయాన్ని జనసేన పార్టీ (JanaSena Party) నిలదీసింది.
A gentle reminder to officially 500 Cr worth AP CM (Richest amongst all CMs) who constantly talks about ‘Class War’ like Karl Marx.The funny part is the ‘oppressor speaks like oppressed’.Any doubts, please check with AP Human Right Groups.