గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ( India: The Modi Question) దేశంలో వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్ లో నిషేధించిన డాక్యుమెంటరీని గణతంత్ర దినోత్సవం రోజు పలుచోట్ల వీక్షించారు. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించిన ఆయా చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణలోని హెచ్ సీయూలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేయడంతో వర్సిటీలో అలజడి మొదలైంది. రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. కాగా కేరళలో బహిరంగంగా ఈ డాక్యుమెంటరీని పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు వీక్షించారు.
కేరళలోని షణ్ముగం బీచ్ లో డాక్యుమెంటరీ వీక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు
కేరళలోని తిరువనంతపురం షణ్ముగం బీచ్ లో బీబీసీ డాక్యుమెంటరీని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రదర్శించింది. కోజికోడ్ తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్యుమెంటరీని వీక్షించారు. అయితే ఈ డాక్యుమెంటరీ తీయడంపై పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ తప్పుబట్టారు. డాక్యుమెంటరీని ప్రమాదకరమైన ఉదాహరణగా పేర్కొన్నాడు. దీంతో అతడిపై కేరళవ్యాప్తంగా తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఈ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.
కేరళలోని మరో ప్రాంతంలో డాక్యుమెంటరీ వీక్షిస్తున్న ప్రజలు