• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎంకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

విజయనగరంలో డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఇవాళ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ సంయుక్త ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్ వలన అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.

March 25, 2026 / 06:00 PM IST

‘పారిశుధ్య లోపాలు సరిచేయాలి’

VSP: పారిశుధ్య పనుల్లో లోపాలను సవరించి, దోమల నియంత్రణ చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులను జీవీఎంసీ క‌మిష‌న్ కేత‌న్ గార్గ్ ఆదేశించారు. నార్త్, వెస్ట్ జోన్లలో పర్యటించిన ఆయన, వ్యర్థాల సేకరణ, కాలువల పరిశుభ్రత పనులు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఫాగింగ్, స్ప్రేయింగ్, ప్రజలకు అవగాహన కార్యక్రమాలను పారిశుధ్య పనులతో కలిపి నిర్వహించాలని తెలిపారు.

March 25, 2026 / 05:57 PM IST

ఉమ్మడి భూముల సంరక్షణ పై శిక్షణ

ప్రకాశం: మర్రిపూడి మండలం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో నాగూర్ వలి అధ్యక్షతన ఉపాధి హామీ సిబ్బందికి ఉమ్మడి భూముల సంరక్షణ పై శిక్షణ తరగతులు జరిగాయి. ఎస్ఎంసీ పనులు పచ్చదనంపై అవగాహనతో పాటు జీవనోపాధి, కార్బన్ క్రెడిట్ పై అవగాహన కల్పించారు. ఉపాధి హామీ సిబ్బందితో పాటు పంచాయతీ సిబ్బంది, సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 25, 2026 / 05:56 PM IST

‘విద్యార్థి నాయకులను విడుదల చేయాలి’

MNCL: మంచిర్యాలలో విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’లో నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని SFI జిల్లా కార్యదర్శి అభినవ్ మండిపడ్డారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ప్రభుత్వ విద్యను గాలికొదిలేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

March 25, 2026 / 05:56 PM IST

ఇందిరమ్మ మా దేవత: పొన్నం ప్రభాకర్

TG: అసెంబ్లీలో ఇందిరమ్మపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ తమ దేవత అని వ్యాఖ్యానించారు. వాజ్ పేయీ కూడా ఇందిరమ్మను ఉక్కు మహిళ, దుర్గామాతా అని అన్నారని గుర్తు చేశారు. రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

March 25, 2026 / 05:53 PM IST

‘శిక్షణకు గైర్హాజరైన బీఎల్ఓలపై కలెక్టర్ ఆగ్రహం’

NZB: నిజామాబాద్‌లో ఓటరు జాబితా సవరణ శిక్షణకు హాజరుకాని బీఎల్ఓలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యంపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

March 25, 2026 / 05:52 PM IST

GOOD NEWS: గడువు పెంపు

TGPSC నిర్వహిస్తున్న వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) అప్‌డేట్ చేసుకునే గడువును మరోసారి పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ్టితో ఈ గడువు ముగియనుండగా.. అభ్యర్థులు సౌకర్యార్థం ఏప్రిల్ 10 వరకు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు. ఇదే చివరి అవకాశమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో అప్లై చేసుకునే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే OTR నమోదు తప్పనిసరి.

March 25, 2026 / 05:52 PM IST

‘ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్’

కోనసీమ: ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో LPG గ్యాస్ తక్కువగా లభ్యం అవుతున్న పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా పైపుల ద్వారా నేరుగా గ్యాస్ ఇంటికి వచ్చే విధానాన్ని ప్రోత్సాహించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్  పైప్ లైన్ గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.

March 25, 2026 / 05:51 PM IST

భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

GNTR: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నిర్వహణ పథకాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరు నగరంలోని 41వ డివిజన్, స్వర్ణభారతి నగర్ మిషన్ ఫామ్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ తనిఖీలో పథకం అమలు తీరును పరిశీలించారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

March 25, 2026 / 05:49 PM IST

పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ

సత్యసాయి: లేపాక్షిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ భూమి పూజ చేశారు. ఆధునిక సౌకర్యాలతో భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని చెప్పారు. CSR నిధులతో సహకరించిన బాలాజీని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

March 25, 2026 / 05:48 PM IST

జాబ్ మేళాకు భారీ స్పందన

PDPL: పెద్దపల్లి టాస్క్ సెంటర్‌లో ఇవాళ నిర్వహించిన ఉద్యోగమేళాకు భారీ స్పందన లభించింది. కలెక్టర్ శ్రీ హర్ష ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. టాస్క్ సెంటర్ ద్వారా అనేక నైపుణ్య కోర్సులలో శిక్షణ అందిస్తూ, ఉపాధి లభించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జాబ్ మేళా వంటి కార్యక్రమాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు.

March 25, 2026 / 05:48 PM IST

‘రెండు జిల్లాల రాకపోకలకు సుగమం’

విజయనగరం, అనకాపల్లి జిల్లాల అనుసంధ కల్వర్ట్ కూలిపోవడంతో రెండు జిల్లాలకు రాకపోకలు తెగిపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రత్యేక చొరవ తీసుకొని యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కల్వర్ట్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాడుగుల ఎమ్మెల్యేతో కలిసి బుధవారం ప్రారంభించారు.

March 25, 2026 / 05:47 PM IST

సేవాదళ్ మండల అధ్యక్షుడిగా ఉపేందర్

HNK: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ హసన్‌పర్తి మండల అధ్యక్షుడిగా మేకల ఉపేందర్ నియమితులయ్యారు. ఈ నియామకపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ చేతులమీదుగా బుధవారం అందుకున్నారు. ఉపేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పట్ల తన నిబద్ధతను గుర్తించి ఈ అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంగా పనిచేస్తానన్నారు.

March 25, 2026 / 05:45 PM IST

ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దు: BJP MLA

TG: శాసనసభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, BJP సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇప్పసారాపై ప్రభుత్వం చిన్నచూపుచూస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఇప్పసారా తీసుకురావాలని.. అయితే ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఇందిరమ్మ పేరు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు.

March 25, 2026 / 05:45 PM IST

కలాం స్కూల్ పనులపై కమిషనర్ సమీక్ష

NLR: జిల్లాలోని మనుమ సిద్ది నగర్‌లో రిత్విక్ ఇన్‌ఫ్రా సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను కమిషనర్ వైఓ. నందన్ బుధవారం సమీక్షించారు. మంత్రి డాక్టర్ నారాయణ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమీక్షలో పనుల నిర్మాణంపై చర్చించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆయన ఆదేశించారు.

March 25, 2026 / 05:45 PM IST