కోనసీమ: ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో LPG గ్యాస్ తక్కువగా లభ్యం అవుతున్న పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా పైపుల ద్వారా నేరుగా గ్యాస్ ఇంటికి వచ్చే విధానాన్ని ప్రోత్సాహించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ పైప్ లైన్ గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.