BHPL: గణపురం మండల ఉపసర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఓరుగంటి కృష్ణ, గౌరవ అధ్యక్షులుగా మలహల్ రావు, ఉపాధ్యక్షులుగా గుర్రం లావణ్య ఎన్నికయ్యారు. గ్రామాల్లోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని వారు చెప్పారు.
సత్యసాయి: జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం జిల్లా పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. పరిశ్రమలకు రావాల్సిన అనుమతులను అధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాల పురోగతిని సమీక్షించి, భూకేటాయింపు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
JGL: పెగడపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 52 మంది విద్యార్థులు పలు గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు మండల విద్యాధికారి సులోచన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4వ తరగతి విద్యార్థులు గురుకుల పరీక్షలు రాయగా, ఇందులో నుంచి 52 మంది విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశానికి గాను సీట్లు సాధించినట్లు పేర్కొన్నారు.
GDWL: మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా శ్రీలత రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎంఏఎం ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేసిన ఆమె, పదోన్నతి పొంది మల్దకల్ రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మొదటి రోజు స్థానిక తిమ్మప్ప స్వామిని దర్శించుకోని కళాశాలకు వచ్చారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. బుధవారం మధ్యాహ్నం నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం సంగారెడ్డిలో అత్యధికంగా 37.5°C ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో గుమ్మడిదల 35.9°C, పటాన్చెరు 35.6°C,రామచంద్రపురం 34.8°C, అమీన్పూర్‌లో 34.6°C గా రికార్డు అయింది. గాలిలో తేమశాతం 39.5% గా ఉండడంతో ఉక్కపోత కూడా తోడైంది.
SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని అలీరాజ్‌పేటలో ఓ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయో రిసోర్స్ సెంటర్‌ను సర్పంచ్ ఎల్లేష్ ప్రారంభించారు. సుమారు 60 ఎకరాలకు సరిపడా ప్రకృతి ఎరువులు (బ్రహ్మాస్త్రం, అగ్నియాస్త్రం,జీవామృతం) అందించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని పేర్కొన్నారు. రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి సిద్ధమైన ఇన్‌పుట్స్ వాడాలని పుర్రా మేనేజర్ రావుల సూచించారు.
MDK: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ముఖ్య అతిథిగా జరిగారు. సర్పంచ్ పద్మ అశోక్ గౌడ్ చేతుల మీదుగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
TG: తానేం తప్పుగా మాట్లాడలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టారని.. ఇప్పసారా తయారు చేస్తే ఇందిరమ్మ పేరు పెట్టొద్దని.. ఆమె అంటే తమకు గౌరవమని అన్నారు. ఇప్పుడు కూడా ఇందిరమ్మను అవమానించలేదన్నారు. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెబుతానన్నారు. కావాలనే మంత్రులు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
VKB: బొంరాస్‌పేట మండలం లింగంపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 5వ తరగతిలో గురుకుల సీట్లు సాధించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు శ్రీహరి అన్నారు. ఈ మేరకు ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయురాలు అమూల్యతో కలిసి అభినందించారు. గౌతమ్, అఖిల్ అనే విద్యార్థులు కొడంగల్ గురుకుల పాఠశాలకు అనన్య, కోకట్ గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు తెలిపారు.
SKLM: బూర్జ మండల పరిషత్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్లు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీటి వనరులను గుర్తించడం, నీటి నాణ్యత పరీక్షలు, క్లోరినేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలని తెలిపారు.
E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైఖరిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాలు, దేవుడి పట్ల రామకృష్ణారెడ్డికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. MLA వైఖరి వల్ల భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సూర్యనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
SKLM: ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎస్.రామ్మోహన్‌రావు అధ్యక్షతన బుధవారం మంచి నీటి సంరక్షణపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలంలో ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించాలని అన్నారు. గ్రామాలకు సరఫరా చేసే నీటి నాణ్యతను తప్పనిసరిగా పరీక్షించాలని ఆదేశించారు.
విజయనగరంలో డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఇవాళ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ సంయుక్త ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్ వలన అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
VSP: పారిశుధ్య పనుల్లో లోపాలను సవరించి, దోమల నియంత్రణ చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులను జీవీఎంసీ కమిషన్ కేతన్ గార్గ్ ఆదేశించారు. నార్త్, వెస్ట్ జోన్లలో పర్యటించిన ఆయన, వ్యర్థాల సేకరణ, కాలువల పరిశుభ్రత పనులు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఫాగింగ్, స్ప్రేయింగ్, ప్రజలకు అవగాహన కార్యక్రమాలను పారిశుధ్య పనులతో కలిపి నిర్వహించాలని తెలిపారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో నాగూర్ వలి అధ్యక్షతన ఉపాధి హామీ సిబ్బందికి ఉమ్మడి భూముల సంరక్షణ పై శిక్షణ తరగతులు జరిగాయి. ఎస్ఎంసీ పనులు పచ్చదనంపై అవగాహనతో పాటు జీవనోపాధి, కార్బన్ క్రెడిట్ పై అవగాహన కల్పించారు. ఉపాధి హామీ సిబ్బందితో పాటు పంచాయతీ సిబ్బంది, సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.