• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పద్ధతి మార్చుకొని పనిచేయండి.. లేక‌పోతే లైసెన్స్‌ బ్లాక్ లిస్ట్‌లోకి’

BHNG: పద్దతి మార్చుకొని పని చేయించండి లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెడ్తానని అదనపు కలెక్టర్ భాస్క‌ర్‌రావు దవాఖానా శానిటేషన్ కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖాన‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి శానిటేషన్ కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి నిర్వ‌హ‌ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 25, 2026 / 06:20 PM IST

‘ఇరుముడి’ నుంచి స్పెషల్ అప్‌డేట్

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. శ్రీరామనవమి కానుకగా రేపు ఈ చిత్రం నుండి ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

March 25, 2026 / 06:20 PM IST

ఘనంగా సీతారామాలయానికి శంకుస్థాపన

VSP: సింహాచ‌లం సమీపంలోని శ్రీనివాసనగర్‌లో శ్రీ సీతారామాలయం ఘనంగా నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గ్రామంలో ఆలయం నిర్మించాలని చాలా కాలంగా భావించి, గ్రామస్తుల సమన్వయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు రాపర్తి త్రివేణి వరప్రసాద్, కన్నా దంపతులు, గంట్ల శ్రీ‌నుబాబు తదితరులు పాల్గొన్నారు. 

March 25, 2026 / 06:19 PM IST

‘మాదకద్రవ్యాల సరఫరాపై నిఘా ఉంచాలి’

కర్నూలు: సెట్కూరు యువజన సర్వీసుల శాఖ, ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ఇవాళ ఏపీఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల సరఫరా నిఘా, డ్రగ్స్ అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు సిగరెట్లు, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. సిగరెట్లతో ప్రారంభమై మత్తు పదార్థాల వైపు దారి తీస్తుందని హెచ్చరించారు.

March 25, 2026 / 06:19 PM IST

‘దళిత క్రైస్తవులపై SC తీర్పు రాజ్యాంగ విరుద్ధం’

కోనసీమ: సుప్రీంకోర్టు తీర్పు వలన దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని న్యాయవాది ధూళి జయరాజు అన్నారు. మండపేటలో బుధవారం అయన మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఉండే రక్షణ కవచం లాంటి చట్టాన్ని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రముఖ దళిత న్యాయవాది దూలి జయరాజు మాదిగ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునర్ విచారించాలని డిమాండ్ చేశారు.

March 25, 2026 / 06:19 PM IST

కేరళం చేరుకున్న సీఎం రేవంత్

కేరళంకు TG సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో.. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్‌కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు CM రేవంత్ కేరళంకు వెళ్లారు.

March 25, 2026 / 06:18 PM IST

పోలీసు అధికారులతో సమావేశమైన ఎస్పీ

ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీస్ అధికారులతో బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హత్య కేసులు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమన్, ప్రాపర్టీ కేసులు, పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు.

March 25, 2026 / 06:18 PM IST

ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన కలెక్టర్

నంద్యాల: పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను రాష్ట్ర ఈవీఎం నోడల్ ఆఫీసర్ ఎస్. ఆంజనేయులతో కలిసి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను కలెక్టర్ పరిశీలించారు.

March 25, 2026 / 06:18 PM IST

ALERT: ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా?

పెట్రోల్, డీజిల్ కొరత ఆందోళనల నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉంటుందా? అనే సందేహం వస్తుంటుంది. వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించినప్పుడు ట్యాంక్‌ను 10 శాతం ఖాళీగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో పెట్రోల్, డీజిల్ త్వరగా ఆవిరైపోతుందని అంటున్నారు.

March 25, 2026 / 06:16 PM IST

‘ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చాలి’

ATP: ప్రభుత్వ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన లబ్ధిని నిష్పక్షపాతంగా, పూర్తిస్థాయిలో అందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన శాతం ప్రకారం నిధులను ఖచ్చితంగా ఖర్చు చేయాలన్నారు. ఉపాధి హామీ, గృహ నిర్మాణ పథకాల్లో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

March 25, 2026 / 06:16 PM IST

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆరా..!

PLD: నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్న పనులు, రానున్న నిధులపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఎంపీడీవోను ఆరాదీశారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ, ప్రతి రూపాయి ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఖర్చు చేయాలన్నారు.

March 25, 2026 / 06:15 PM IST

‘అన్ని శాఖల అధికారులు డ్రగ్స్‌‌ను నియంత్రించాలి’

SRCL: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో డ్రగ్స్‌ను నియంత్రించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.

March 25, 2026 / 06:15 PM IST

‘విద్యారంగం బలోపేతానికై పోరాడుదాం’

BDK: PDSU, PYL ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన స్ఫూర్తియాత్ర ఇవాళ భద్రాచలం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ముగిసింది. PDSU అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ మాట్లాడుతూ.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై సమరశీల పోరాటాలకు రూపకల్పన చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ సవరించి కనీసం 20 శాతం నిధులు మంజూరు చేయాలన్నారు.

March 25, 2026 / 06:15 PM IST

136వ రోజుకు చేరుకున్న ఆదివాసి సత్యాగ్రహ యాత్ర

ASR: జీ.మాడుగుల మండలంలో ఆదివాసి సత్యాగ్రహ యాత్ర 136వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా పెదలోచలి, గొడుగుమమిడి, వంతల గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు నిర్వహించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక చట్టం చేయాలని ఆదివాసి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

March 25, 2026 / 06:14 PM IST

వరకట్న వేధింపుల నిర్మూలనపై అవగాహన

VSP: వరకట్న వేధింపుల నిర్మూలనపై విశాఖలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స‌న్యాసినాయుడు మాట్లాడుతూ.. వరకట్నం సమాజానికి చీడ అని, మహిళలు చట్టపరమైన హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం అధికారులు మహిళా రక్షణ చట్టాల గురించి వివరించారు.

March 25, 2026 / 06:11 PM IST