పెట్రోల్, డీజిల్ కొరత ఆందోళనల నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉంటుందా? అనే సందేహం వస్తుంటుంది. వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించినప్పుడు ట్యాంక్‌ను 10 శాతం ఖాళీగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో పెట్రోల్, డీజిల్ త్వరగా ఆవిరైపోతుందని అంటున్నారు.