సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బుధవారం సాయంత్రం వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు.