నంద్యాల: పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను రాష్ట్ర ఈవీఎం నోడల్ ఆఫీసర్ ఎస్. ఆంజనేయులతో కలిసి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను కలెక్టర్ పరిశీలించారు.