SRCL: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో డ్రగ్స్‌ను నియంత్రించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.