మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ను ఇచ్చారు. శ్రీరామనవమి కానుకగా రేపు ఈ చిత్రం నుండి ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.