• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

MBNR: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా అందించే రుణాలపై అవగాహన లేని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశానికి బుధవారం కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న సన్నకారు రైతులకు రుణాలు ఇచ్చి వారికి సహకరించాలని కోరారు.

March 25, 2026 / 06:36 PM IST

దివ్యాంగులకు త్రీ వీలర్ల ఎంపిక శిబిరం

సత్యసాయి: జిల్లాలో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ త్రీ వీలర్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు బుధవారం అర్హత శిబిరం నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. ఆరు నియోజకవర్గాలకు చెందిన 94 మంది విభిన్న ప్రతిభావంతులు ఈ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా కమిటీ సభ్యులు అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు.

March 25, 2026 / 06:35 PM IST

పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

SKLM: జి.సిగడాం మండలం వెంకయ్యపేట పంచాయితీ సర్పంచ్ మామిడి ధనలక్ష్మి స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆయన స్వగృహానికి వెళ్ళి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పి ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కాయల రమణ, ఎంపీపీ ప్రతినిది మీసాల రమణ ఉన్నారు.

March 25, 2026 / 06:35 PM IST

చైన్ స్నాచింగ్ నిందితుడి కోసం గాలింపు

ఖమ్మం నగరంలోని గుట్టల బజార్ రాధాకృష్ణ ఆసుపత్రి సమీపంలో సోమవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. హోండా షైన్ బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఓ వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి ఫోటోలను త్రీ టౌన్ పోలీసులు బుధవారం విడుదల చేశారు. నిందితుడిని గుర్తిస్తే 8712659115కు సమాచారం అందించాలన్నారు.

March 25, 2026 / 06:35 PM IST

జిల్లాలో ప్రశాంతంగా భౌతిక శాస్త్రం పరీక్ష

W.G. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 23,536 మంది విద్యార్థులకు గాను 23,005 మంది హాజరయ్యారు. 531 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఓపెన్ స్కూల్ సాంఘిక శాస్త్రం పరీక్షకు 221 మంది హాజరుకాగా, 41 మంది రాలేదని పేర్కొన్నారు.

March 25, 2026 / 06:34 PM IST

13 కేజీల గంజాయి స్వాధీనం

ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్ప్రెస్ రైలు బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఈగల్ టీం సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ కలహండికి చెందిన ఆరుగురు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

March 25, 2026 / 06:34 PM IST

రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: స్పీకర్

TG: ఇందిరమ్మపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. అయితే  రాకేష్ రెడ్డి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాకేష్ వ్యాఖ్యలను తొలగించాల్సిన అవసరం లేదన్నారు.

March 25, 2026 / 06:32 PM IST

డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

CTR: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల వద్ద డ్రగ్స్, పొగాకు ఇతర నిషేధిత వస్తువులు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంపై ఎస్పీ తుషార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.

March 25, 2026 / 06:32 PM IST

బూర్గంపాడు కేంద్రంగా కొత్త నియోజకవర్గం..?

BDK: నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసెంబ్లీ స్థానాలు 10 నుంచి 15 కు పెరిగే అవకాశముండటంతో బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచ ప్రాంతాలను కలిపి కొత్త సీటు ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గతంలో నియోజకవర్గంగా ఉన్న బూర్గంపాడును మళ్లీ నియోజకవర్గంగా చేయాలని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

March 25, 2026 / 06:32 PM IST

‘సజావుగా దాన్యం కొనుగోలు చేపట్టాలి’

KKD: రబీ 2025-26 సీజనులో రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా ధాన్యం కనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు ధాన్య సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

March 25, 2026 / 06:32 PM IST

గురుకుల ప్రవేశ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ

MDK: తూప్రాన్ మండలం నర్సంపల్లి శివారు రెడ్యానాయక్ తండాకు చెందిన నలుగురు విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి ఎంపికైనట్లు HM సుధాకర్ తెలిపారు. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా నలుగురు ఎంపికైనట్లు వివరించారు. విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఎంఈవో డాక్టర్ సత్యనారాయణ అభినందించారు.

March 25, 2026 / 06:32 PM IST

‘శంకరయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలి’

NLG: తిప్పర్తి (M) ఎర్రగడ్డలగూడెంలో CPM సీనియర్ నాయకుడు గండమండ శంకరయ్య స్తూపం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సభ్యుడు సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. శంకరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దోపిడీ దౌర్జన్యాలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని, ఆ పార్టీకి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు.

March 25, 2026 / 06:32 PM IST

మంత్రిని కలిసిన కొల్కూరి నరసింహారెడ్డి

SRD: రాష్ట్ర బడ్జెట్లో కార్మిక శాఖకు 1000 కోట్లు కేటాయించడం హర్షాన్నిచ్చిందని పటాన్ చెరువు INTUC ట్రేడ్ యూనియన్ నాయకుడు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటస్వామిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

March 25, 2026 / 06:30 PM IST

ఆలయంలో హుండీ లెక్కింపు

NGKL: పదర మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మద్దిమడుగు శ్రీపబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 85 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 19,11,392 ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి, ఆలయ ఈవో నరసింహ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది.

March 25, 2026 / 06:30 PM IST

క్షయ నిర్మూలనలో జగిత్యాలకు ‘స్టేట్ అవార్డు’

JGL: వరల్డ్ TB డే సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన వేడుకల్లో జగిత్యాల జిల్లా సత్తా చాటింది. క్షయ వ్యాధి నిర్మూలనలో విశేష కృషి చేసినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లా 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్యాధికారి డా.శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమష్టి కృషితోనే ఈ అవార్డు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.

March 25, 2026 / 06:30 PM IST